బ్రెజిల్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజీక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని పలు రాష్ట్రాల గవర్నర్‌లు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ల ఆరోపణలపై జెయిర్ బొల్సోనారో స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక రాజధాని సావ్‌పాలోలోని కరోనా వైరస్ మరణాల సంఖ్యను తారుమారు చేశారని మండిపడ్డారు. అంతేగాక అక్కడ మరణాల సంఖ్యపై తనకు సందేహం ఉందని కూడా ఆరోపించారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)
‘కరోనా మరణాల సంఖ్య తారుమారు’